telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అర్చకుల కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వాలి – హిందూ బ్రాహ్మన్ ఫెడరేషన్ అధ్యక్షులు

Brahmin

రాష్ట్రంలో ఉన్న అర్చకుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. రాష్ట్రంలో కరోనా ప్రాభల్యం పెరుగుతున్న నేపథ్యంలో అర్చకుల కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అర్చకుల ఇబ్బందుల పట్ల దృష్టి సారించి వారిని ఆదుకోవాలి. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నా, పెద్ద దేవాలయాల్లో అర్చక సేవలు నిలిచిపోయాయి. కరోనా భయంతో దేవాలయాల్లో భక్తుల తాకిడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో అర్చకుల జీవనం చాలా దుర్భరంగా మారింది. ఈ సంక్షోభ సమయంలో వారికి అండగా నిలబడాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఇస్తామన్న పదివేల సాయం ఇప్పటికీ ఎవ్వరికీ అందలేదు. ప్రతి పేద అర్చకుడికి ప్రభుత్వం వెంటనే రూ. 10 వేలతోపాటు ఉచిత రేషన్, నిత్యవసరల సరుకులు అందజేయాలి. ఇప్పటికే శ్రీవారి కైంకర్యాల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించే స్వామీజీ కోవిడ్ బారిన పడ్డారు. ఆయన శిష్య బృందం 30 మంది నుండి కూడా కరోనా శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్స్ ఫలితాలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బ్రాహ్మణుల ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బ్రాహ్మణులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పదివేలను కూడా బ్రాహ్మణ కార్పోరేషన్ నుండి కాకుండా ప్రత్యక నిధిని కేటాయించి ఇవ్వాలి. అర్చకుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం అర్చకుల సమస్యలపట్ల తక్షణం స్పందించి ఆదుకోవాలి.

బుచ్చి రాంప్రసాద్
హిందూ బ్రాహ్మన్ ఫెడరేషన్ అధ్యక్షులు

Related posts