శాసనసభలో ‘హెరిటేజ్ ఫుడ్స్’పై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ఆరోపణలను హెరిటేజ్ సంస్థ కొట్టిపారేసింది. ఈ మేరకు ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చింది. వ్యాపార విస్తరణలో భాగంగా గుంటూరు చుట్టుపక్కల భూములు కొనుగోలు చేయాలని 2014 మార్చిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 3నెలలకు జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొంది. కంతేరులో మొత్తం 9.67ఎకరాల భూమి హెరిటేజ్ ఫుడ్స్ పరిధిలో ఉందని.. మొత్తం 3దశల్లో ఈ భూమిని 2014 జులై, ఆగస్టు నెలల్లో కొనుగోలు చేసినట్లు తెలిపింది. హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూమి రాజధాని అమరావతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వం సభలో చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది.
previous post


టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది: ఉత్తమ్