telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఇక మీదట వాటి తయారీ, అమ్మకాలపై నిషేధం.. తెలంగాణ సర్కారు

తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఈ క్రమంలో.. తెలంగాణ సర్కార్ కూడా దీనిపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది.

తెలంగాణను మత్తుపదార్థాలు అమ్మడంపై కొరడా ఝుళిపించింది. ఇక మీదట తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా గుట్కాలు, పాన్ మసాలాలను తయారు చేయడం, అమ్మడం వంటికి చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.

మత్తుపదార్థాల ఫ్రీస్టేట్ గా తెలంగాణకు మార్పు చేయడానికి అన్నిరకాల చర్యలు తీసుకొవాలని పోలీసులు, అబ్కారీ అధికారులు, విజిలెన్స్ శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రజల ఆరోగ్యం, భద్రతల దృష్ట్యా గుట్కా తయారీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు రేవంత్ సర్కారు వెల్లడించింది.

పొగాకు, నికోటిన్‌లు ఇతర మత్తు పదార్థాల తయారీ, అమ్మడం, గుట్కా/పాన్‌ మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించిబడినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఇరు తెలుగు స్టేట్స్ లలో ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి హేమ పాల్గొన్నట్లు పోలీసులు ఆరోపించారు.

ఆమె బ్లేట్ సాంపుల్ లో.. డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్టు రావడంతో తమ ముందు హజరు కావాలంటూ బెంగళూరు క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.

ఇక రేవ్ పార్టీ విషయంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్న కూడా వదలోద్దని దర్యాప్తును వేగవంతంగా జరపాలన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మత్తుపదార్థాల ఫ్రీ స్టేట్ గా మార్చాలని అన్నారు. అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

Related posts