telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహాశివరాత్రి : గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌ ప్రభుత్వం

మహా శివరాత్రి జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. శివరాత్రి సందర్భంగా భక్తులు సులభంగా ప్రయాణించేందుకు వేములవాడ రాజన్న సన్నిధిలో హెలికాప్టర్ సేవలను బుధవారం ప్రారంభించారు. 14 వ తేదీ సాయంత్రం వరకు ఈ హెలికాప్టర్ అందుబాటులో ఉంటుంది. జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ శ్రీమతి అరుణ, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లు శ్రీ ఆర్.అంజయ్య, శ్రీ బి.సత్య ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్ లు హెలిప్యాడ్ వద్ద పూజ చేసి హెలిప్యాడ్ సేవలను ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ శ్రీమతి అరుణ, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మాధవి, జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లు శ్రీ ఆర్.అంజయ్య, శ్రీ బి.సత్య ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్, ఆర్డీఓ శ్రీ శ్రీనివాస రావు, డీఎస్పీ శ్రీ చంద్రకాంత్, ఆలయ ఈఓ శ్రీ కృష్ణ ప్రసాద్ లు హెలికాప్టర్ లో ప్రయాణించి గగనతలం నుండి ఆలయ పరిసరాలు, ఏర్పాట్లను వీక్షించారు.

ఛార్జీల వివరాలు
వేములవాడ నుండి నాంపల్లి వరకు 7 నిమిషాల గగనతల ప్రయాణం చేసేందుకు ప్రతి ఒకరి వద్ద నుంచి రూ.3 వేలు చొప్పున టిక్కెట్ ను వసూలు చేయనున్నారు.

వేములవాడ నుంచి నాంపల్లి మీదుగా మధ్య మానేరు డ్యామ్ అందాల వీక్షించేందుకు వీలుగా 15 నిమిషాల గగనతల ప్రయాణానికి ఒక్కరికి రూ. 5500 వసూలు చేయనున్నారు.

Related posts