బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం రాజస్థాన్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ తీగలు టెంట్‌పై పడటంతో 14 మంది చనిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బడ్మేర్‌లో గాలివాన కారణంగా విద్యుత్ తీగలు తెగి అక్కడున్న టెంట్‌పై పడటంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా వంద మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
previous post
ఏపీ గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల ప్రస్తావన!