71వ జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలకు హృదయపూర్వక అభినందనలు.
జాతీయ ఉత్తమ నటులుగా ఎంపిక అయిన షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాసే (12th ఫెయిల్), జాతీయ ఉత్తమ దర్శకుడు సుదీప్తో సేన్ (కేరళ స్టోరీ), జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (వాతి) లకు ప్రత్యేక అభినందనలు.
తెలుగు చలన చిత్ర సీమకు సంబంధించి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన భగవంత్ కేసరి చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి అభినందనలు.
జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ క్యాటగిరిలో ఎంపిక అయిన హనుమాన్ చిత్ర బృందానికి, జాతీయ ఉత్తమ పాటగా ఎంపిక అయిన ఊరూ పల్లెటూరు (బలగం) గాయనీగాయకులకు, గీత రచయితకు,
జాతీయ ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్ సాయి రాజేష్ (బేబీ)కు, జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడు పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ)కు అభినందనలు అని చంద్రబాబు ట్వీట్ చేసారు.