బీజీ లైఫ్ లో ప్రతి మనిషి కూడా డబ్బు సంపాదించాలనే ఆశతో పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎంతో ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే.. ఇక ఆరోగ్యంగా ఉండడానికి రోజు వారి నియమ నిబంధనలు కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే.. ఎంతో మంది మూత్ర విసర్జన మల విసర్జన విషయంలో బద్ధకంగా ఉంటున్నారు. చాలా మంది మూత్ర విసర్జనను అశ్రద్ధ చేస్తుంటారు. పని ఒత్తిడిలో పడిపోయి ప్రకృతి ధర్మాన్ని దాటేస్తుంటారు. ఆపై ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మూత్రశయం చుట్టూ ఉండే కండరాలు బలహీనపడిపోతాయి. యూరినరీ ఇన్‌ఫెక్షన్లు చోటు చేసుకుంటాయి. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదు. మూత్ర శయం నిండిపోవడం వల్ల, గుండె మీద ఒత్తిడి పెరుగుతుందని తైవాన్ యూనివర్సిటీ వారు హెచ్చరిస్తున్నారు. హృద్రోగులు మూత్రాన్ని ఆపే ప్రయత్నం చేస్తే.. గుండెపోటు వచ్చే ఆస్కారం ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు.
previous post
next post
కరోనా ఎఫెక్ట్… “ఆర్ఆర్ఆర్” మరోసారి వాయిదా