telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

60 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసిన పాక్

SIT Investigation YS viveka Murder

గత కొంతకాలంగా పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న 60 మంది భారతీయ ఖైదీలను ఎట్టకేలకు పాకిస్తాన్ విడుదల చేసింది. వీరిలో 55 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరందరిని వాఘా సరిహద్దు వద్ద వదిలి పెట్టారు. సముద్రంలో చేపలు పడుతూ పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లడంతో మత్స్యకారులను అరెస్ట్ చేశారు. మిగిలిన ఐదుగురుని పాకిస్థాన్ లోనే అరెస్ట్ చేశారు. సరైన వీసా, డాక్యుమెంటేషన్ లేని కారణంగా అదుపులోకి తీసుకున్నారు.

ఈరోజు విడుదలైనవారంతా తమ జైలు శిక్ష కాలాన్ని పూర్తి చేసుకున్నవారే. వీరిలో కొందరు శిక్షాకాలం కంటే ఎక్కువగానే జైలు జీవితాన్ని గడిపారు. ఈ సందర్భంగా షోయబ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, డబ్బ సంపాదన కోసం తాను పాకిస్థాన్ వెళ్లానని, అయితే ఒక చెడు సంస్థ చేతిలో పడ్డానని వాపోయాడు. తనకు 3 నెలల జైలు శిక్ష పడిందని, కానీ, 18 నెలలు జైలు జీవితాన్ని గడిపానని చెప్పారు. మరో వ్యక్తి వాహిద్ ఖాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ, పాకిస్థాన్ లో తన వీసా పోగొట్టుకున్నానని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, 20 నెలలు జైల్లో ఉంచారని తెలిపాడు.

Related posts