శరీరం వేడెక్కినప్పుడు చెరకు రసం తీసుకుంటే మంచిది. చెరుకు రసం తాగడం వల్ల దాహం తీరడమే కాకుండా తిన్న ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తుంది. అలసట, ఒత్తిడి, నీరసంగా అనిపించినప్పుడు రెండు గ్లాసుల షుగర్ కేన్ తాగితే తక్షణమే ఎనర్జీ పొందవచ్చు. ఇంకా చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
చెరకు రసం తో లాభాలు
మగవాళ్ళలో శుక్ర కణాల నాణ్యతను మెరుగుపరుస్తుంది.
తల్లి అయిన వాళ్లలో పాల ఉత్పత్తిని పెంచుతోంది
మహిళలలో పీరియడ్స్ టైం లో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
కామెర్ల చికిత్స లో చక్కగా పనిచేస్తుంది
శరీర ఉస్నోగ్రతను తగ్గిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
అలసట, నీరసంగా అనిపిస్తే..చెరకు రసం తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది.
మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

