telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ సినిమాలో దేవుడిగా ప్రభాస్… ?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ఈ చిత్రానికి ‘ఓ డియర్’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూజాహెగ్డే ప్రభాస్‌తో జోడీ కడుతోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్‌లో ఉండబోతోందని సమాచారం. ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. మానవుడు దేవకన్యకి పుట్టిన పిల్లోడు భూమి మీద ఎలాంటి విన్యాసాలు చెయ్యగలడు అన్న సోషియో ఫాంటసీ కథతో ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. అయితే ఈ కథ ప్రజెంట్ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా సైన్స్ అండ్ దేవుడు అనే అంశాల చుట్టూ ఉండబోతుందట. మరో ఆసక్తికరమైన విషయంతో ఏంటంటే ప్రభాస్‌ని దేవుడిగా చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ సోషియో ఫాంటసీ కథ నిజమా కాదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts