తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. హైద్రాబాద్ తామామతి బారాదరిలో తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధుల నిర్వహణ అంత సులువు కాదన్నారు.
స్థానిక సంస్థల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా నిర్వహించిందన్నారు. ఇందుకుగాను తెలంగాణ ఎన్నికల సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎన్నికల సంఘం అధికారులు పాల్గొన్నారు.


