భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చ్సుకోకపోవడం, నిత్యం గొడవలు పడుతూ ఉండడంతో విడాకులు కావాలని కోర్టుకెక్కుతుంటారు. కానీ ఈమె మాత్రం తన భర్త పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, విడాకులు కావాలని కోర్టుకెక్కింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కటరా హిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇతనికి గత కొంత కాలం క్రితం వివాహమైంది.
అయితే తాను సివిల్స్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు గట్టిగా చదువుతున్నాడు. ఈ క్రమంలో భార్యతో సినిమాలకు, షాపింగ్‌కు వెళ్లేందుకు భర్త సమయం ఇవ్వడం లేదు. ఒక్కదానివే సినిమాకు, షాపింగ్‌కు వెళ్లమని చెబుతున్నాడు భర్త. దీంతో విసిగిపోయిన భార్య.. తనకు తన భర్త నుంచి విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.