ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, ఈ విషయమై టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సుధారాణి స్పందించారు. అమరావతి ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా? అని సంధ్యారాణి ప్రశ్నించారు. వైసీపీ పాలన వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఉందన్నారు.
మహిళల స్నానపు గదులపై డ్రోన్లు ఎగరవేయడాన్ని ప్రశ్నించిన రైతులపై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. పల్లెల్లో పైకప్పు లేని స్నానపు గదులు ఉంటాయని, డ్రోన్లు తిప్పొద్దని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రి సుచరిత, రోజా నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.
అయోధ్యలో మసీదు నిర్మాణం.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు