గత మూడు నెలల క్రితం భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో పాటుగా, ఆర్ధిక వ్యవస్థలు క్రమంగా పుంజుకోవడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణమని నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 290 తగ్గి రూ.49,190కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గి రూ.53,660కి చేరింది.