telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

షాక్ ఇచ్చిన బంగారం, వెండి..రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్‌ మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు పెరిగి పోయాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెరిగి పోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 48,270 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 44,250 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 500 పెరిగి రూ.74,200 వద్ద కొనసాగుతోంది.

Related posts