ఒకే ఫ్యాన్ కు ఉరేసుకొని ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ లో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా పోతునపల్లికి చెందిన మమత, కొంతకాలం క్రితం తల్లిదండ్రులతో కలిసి నగరానికి వచ్చి శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటూ ఇంటర్ పూర్తి చేసింది. వారి ఇంటి పక్కనే కర్నూలు జిల్లా మాధవరం ప్రాంతానికి చెందిన గౌతమి, తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.
గత కొంతకాలంగా వారి వివాహం ఎలా చేయాలన్న విషయమై తల్లిదండ్రులు మధనపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తాము పెద్దలకు భారం అవుతున్నామన్న మనస్తాపంలో పడిన మమత, గౌతమి, తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ఒకే ఫ్యాన్ కు ఉరేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాశారు. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
ఎమ్మెల్యే రోజావి పగటి కలలు: టీడీపీ ఎమ్మెల్యే అనిత