మెట్రో స్టేషన్ లో కొంతమంది యువతీ యువకులు రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్‌ని కేంద్రంగా చేసుకొని టిక్ టాక్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
తాజాగా హైదరాబాద్ నగరంలోని మెట్రో స్టేషన్లో స్నేహితులతో కలిసి ఓ యువతి ఫ్లాట్‌ఫామ్‌పై చేసిన టిక్ టాక్ వీడియో వైరల్ గా మారింది.
మెట్రో స్టేషన్లో నిముషం కూడా ఎవరినీ ఉండనివ్వని అధికారులు ఈ యువతిని ఎలా అనుమతించారనే ప్రశ్నలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో ఆ వీడియో కాస్తా మెట్రో అధికారుల దృష్టికి చేరింది. వీడియోపై స్పందిస్తూ.. ఈ వీడియోను ఏ స్టేషన్లో చేశారో గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు వివరణ తెలిపారు.


కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: గుత్తా