రోడ్ల మరమ్మత్తులపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రోడ్ల మరమ్మత్తులకు నిధుల కేటాయింపు చేసింది. 7969 కిలో మీటర్ల మేర రోడ్ల మరమ్మత్తులకు రూ. 2205 కోట్లు కేటాయిస్తూ పరిపాలనానుమతులు ఇచ్చింది. రాష్ట్ర రహదారులు-2726 కిమీ, జిల్లా రహదారులు-5243 కిమీ మేర మరమ్మత్తులు చేపట్టనుంది ఆర్ అండ్ బి. రాష్ట్ర రహదారి అభివృద్ధి కార్పోరేషన్-ఆర్డీసీ ద్వారా నిధుల కేటాయింపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్రోల్, డిజీల్ మీద వేసిన సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎస్క్రో చేసి బ్యాంకుల నుంచి రుణం తీసుకోనున్న ఆర్డీసీ… ఆర్డీసీ తీసుకున్న రుణంతో రోడ్ల మరమ్మత్తులు చేపట్టనుంది ఆర్ అండ్ బి.
previous post

