telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో ఘోరం… ఎస్సారెస్పీ కాలువలో పడి 17 బర్రెలు మృతి

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలోని రాయికల్‌ మండలంలో 17 గేదేలు మృతి చెందాయి. రాయికల్‌ మండలంలోని అయోధ్య గ్రామానికి 250 గేదేల మంద ఎస్సారెస్పీ కెనాల్‌లో నీళ్లు తాగేందుకు వెళ్లాయి. ఈ తరుణంలో నీటి ప్రవాహానికి గేదేలు కొట్టుకుపోయాయి. ఇందులో ఊపిరి ఆడక ఏకంగా 17 గేదేలు అక్కడిక్కడే మృతి చెందాయి. దీంతో అక్కడ ఉన్న స్థానికులు, రైతులు షాక్‌ తిన్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గేదేల మృతి వల్ల నష్ట పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Related posts