telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ గ్యాంగ్ రేప్.. ఇన్నోవాలో ఫోరెన్సిక్ టీమ్‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

హైద‌రాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక రేప్‌ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు నిందితులను గుర్తించారు. అదే రోజు రాత్రి సాదుద్దీన్​ మాలిక్​ (18) అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్లు కావడం వల్ల మరో ఇద్దరు నిందితులను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజి​ కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రెండు కార్లను క్లూస్‌ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణులు ఆదివారం క్షుణ్ణంగా పరిశీలించారు.

అలాగే అత్య‌చారం చేసిన‌ ఇన్నోవాలో బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పును క్లూస్‌ టీమ్‌ సేకరించింది. ఇన్నోవా కారులోనూ బాలిక వెంట్రుకలు దొరకగా వాటితో పాటు.. నిందితుల వీర్య నమూనాలను కూడా ఫోరెన్సిక్‌ బృందం గుర్తించింది. వీర్య నమూనాలు, బాలిక వెంట్రుకలు ఎఫ్ఎస్ఎల్‌కు పోలీసులు పంపించారు.

ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజి​ కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రెండు కార్లను క్లూస్‌ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణులు ఆదివారం క్షుణ్ణంగా పరిశీలించారు. బెంజి కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి.

అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రిలీజ్ చేసిన ఆధారాల్లో ఎమ్మెల్యే కొడుకు వీడియోను ప‌రిశీలించారు పోలీసులు. ఈ వీడియోల్లో బాధితురాలితో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే కొడుకు ఏ6 నిందితుడిగా చేర్చేందుకు పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని మరోసారి తీసుకోనున్నారు. 

ఇన్నోవా వాహనంలో బాలికను తీసుకెళ్లే సమయంలో ఇన్నోవాలో ఎమ్మెల్యే కుమారుడు (17) సైతం ఉన్నాడు. అతడు కొద్ది నిమిషాల్లోనే కారు దిగి బేకరీ వైపు వెళ్లాడని పోలీసులు వెల్లడించారు.

అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు.. అతడి ఆచూకీ కోసం కూడా గాలిస్తున్నట్టుగా సమాచారం . అయితే ఎమ్మెల్యే కుమారుడు విదేశాల‌కు పారిపోయిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా.. అత్యాచారం ఘటనకు సంబంధించి పోలీసులు సోమవారం మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన పాతబస్తీకి చెందిన సుభాన్​ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

 గ్యాంగ్ రేప్ బాధితురాలు నిందితులతో కలిసి కారులో ఉన్న వీడియోలను లీక్ చేయడంతో పాటు వైరల్ చేశారని పోలీసులు గుర్తించారు. సుభాన్ కు వీడియోలు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.

Related posts