అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ యువతికి అర్ధరాత్రి తరువాత ఎవరో వస్తున్నట్టుగా అనుమానం రావడంతో సీసీ కెమెరాను ఏర్పాటు చేసింది. ఆ తరువాత రోజు ఏం రికార్డు అయ్యిందోనని చూసింది. ఆ రికార్డింగ్‌ను ప్లే చేసి చూసిన యువతి ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. ఆ కెమెరాలో ఓ తోడేలు రావడం… రాత్రి సమయంలో వచ్చిన ఆ తోడేలు సరిగ్గా కెమెరాపై మూత్రం పోయడం కన్పించింది. దీంతో ఆమె ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో షేర్లు, లైకులు సంపాదించుకుంటోంది.
previous post
కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీకి : మంత్రి ప్రత్తిపాటి