telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

సివిల్స్ విజేతగా .. తొలి గిరిజన యువతి ..

first Tribal girl got place in civils from kerala

సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజేతగా నిలిచిన తొలి గిరిజన యువతిగా కేరళకు చెందిన శ్రీధన్య సురేష్ రికార్డులకెక్కింది. విశేషమేమిటంటే ఈమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన యువతి. దీనితో రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆమెకు అభినందనలు తెలిపారు. శ్రీధన్య కృషి, అంకితభావం ఆమె కలను నిజం చేసిందని రాహుల్ పేర్కొన్నారు.

ఈ విజయం సాధించిన శ్రీధన్యకు, ఆమె కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి పినరాయ్ విజయం ఆమెను అభినందించారు. 22 ఏళ్ళ శ్రీధన్య 2018 సివిల్ సర్వీస్ పరీక్షల్లో 410 వ రాంక్ సాధించింది. కేరళ నుంచి సివిల్స్ సాధించిన 29 మందిలో శ్రీధన్య ఒకరు.

ఈ విజయం బాగానే ఉంది కానీ, ఈ వార్త రాసేప్పుడే కొంచం ఏదోలా ఉంది. విజయం సాధించిన భారతీయులు అంటే బాగుండేది, ఆ కులం వారు, ఈ మతం వారు, ఆ జెండర్ వాళ్ళు అని విడదీయకుండా ఉంటె బాగుండేది. నిజమే పలానా అని వివరాలు తెలిస్తే, ఆ జాతి వారికి ఉత్ప్రేరకంగా కూడా ఉంటుంది, వారి నుండి చాలా మంది ముందడుగు వేసే అవకాశాలు లేకపోలేదు. ఈ చిన్న ఛాన్స్ కంటే, అంతా ఒక్కటే అనే పెద్ద అవకాశం చాలా ఉత్తమమైనదని .. ఈ వార్త రాసేప్పుడు నాకు అనిపించింది. 

Related posts