telugu navyamedia
సినిమా వార్తలు

సరికొత్త లుక్ తో షాకిచ్చిన దీపికా పదుకొనె

Deepika-Padukone

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తాజాగా ఓ బయోపిక్ లో నటిస్తోంది. ఆ బయోపిక్ ఎవరిదంటే ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ అనే అమ్మాయిది. ఈ సినిమాకు ఇప్పటికే “ఛాపక్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ న ఈరోజు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు దీపికా.

“ఈ పాత్ర నాలో ఎప్పటికీ నిలిచిపోతుంది.. ఛాపక్ షూటింగ్ ఈరోజు నుంచే మొదలు” అంటూ పోస్ట్ చేసింది దీపిక. ఇలా దీపికను చూసిన ఆమె అభిమానులు లైకులు, షేర్లతో కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పాత్రపేరు “దీపిక మాలతీ”. లక్ష్మీ అగర్వాల్ బయోపిక్ అయినప్పటికి ఆమె పేరును ఈ బయోపిక్ లో వాడడం లేదు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికకు జోడిగా విక్రాంత్ మస్సె నటిస్తున్నారు. 2020 జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts