telugu navyamedia
సినిమా వార్తలు

‘పుష్ప’ నుంచి ‘శ్రీవల్లి’ ఫుల్‌ వీడియో సాంగ్..

ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటించిన సినిమా ‘పుష్ప. ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా గత డిసెంబర్​ 17న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

Pushpa's Second Single 'Srivalli' Featuring Allu Arjun And Rashmika Mandanna Is Soulful And Bewitching! - Filmibeat

ఈ సినిమాలో బన్నీ ఊర‌మాస్‌ గెటప్​, నటన హైలైట్​గా నిలిచాయి. అంతేకాకుండా ఈ సినిమాలోని అన్ని పాటలు యూట్యూబ్​ విడుదల చేసిన టాప్​-100 గ్లోబల్​ సాంగ్స్​ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

ఈ మూవీలోని ‘’సూపే బంగారమాయేనే శ్రీవల్లి’సాంగ్‌ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. విడుదలకు ముందే సినిమాకు ఎంతో క్రేజ్​ తీసుకొచ్చిందీ. ఈ పాట ఫుల్‌ వీడియో ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న అభిమానుల‌కు చిత్రబృందం సర్‌ప్రైజ్‌ అందించింది.

Pushpa The Rise: New song on 'Srivalli' character takes the Internet by storm | Regional-cinema News – India TV

సోషల్‌ మీడియా వేదికగా ‘శ్రీవల్లీ’ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట‌లో ప‌ల్లేటూరు అమ్మాయిగా రష్మిక ఎక్స్‌ప్రెషన్స్‌ , బన్నీ మాస్‌ ‘చెప్పు స్టెప్పు’ లు అదిరిపోయాయి. ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ ట్యూన్లు అందించ‌గా ..చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా..సిధ్‌ శ్రీరామ్‌ అద్భుతంగా ఆలపించాడు. ప్ర‌స్తు తం ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related posts