ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. భారత్ స్టార్ షూటర్ అపూర్వి చండీలా రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో పసిడి గెలుచుకున్నారు. ప్రపంచకప్‌లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో అపూర్వి స్వర్ణాన్ని సాధించారు. సరికొత్త రికార్డుతో అపూర్వి పసిడి గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో మొత్తం 252.9పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన అపూర్వి పసిడితో మెరిశారు.
అంతకుముందు అంజలీ భగవ్ ఈ ఫీట్ సాధించారు. కాగా, ఇది ప్రపంచకప్‌లో అపూర్వికి మూడో పతకం. గత ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో అపూర్వి రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తాజా ప్రపంచకప్ షూటింగ్‌లో రజత, కాంస్య పతకాలు చైనా దక్కించుకుంది. జోహో రుజు (251.8పాయింట్లు), రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకోగా, మరో చైనా షూటర్ ఝు హాంగ్ (230.4)కాంస్యాన్ని దక్కించుకున్నారు.


