telugu navyamedia
క్రీడలు వార్తలు

నువ్వు నా పవర్‌ ప్లే బౌలర్‌వి అని ధోని నాకు చెప్తుంటాడు : చహర్‌

ఐపీఎల్‌లో మహీ సారథ్యంలోని చెన్నై తరపున ఆడే దీపక్‌ చహర్‌ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది చహర్‌తో పవర్‌ ప్లేలోనే మూడు ఓవర్లు బౌలింగ్ చేయించిన ధోనీ.. ఊహించనిరీతిలో ఫలితాలు రాబట్టాడు. మహీ సూచనలతో పొదుపుగా బౌలింగ్ చేసిన చహర్.. ప్రత్యర్థి ఓపెనర్ల వికెట్లని పడగొడుతూ వచ్చాడు. తాజాగా దీపక్‌ చహర్‌ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడాలనేది నా సుదీర్ఘ కల. అది నెరవేరింది. అతని సారథ్యంలో ఎంతో నేర్చుకున్నా. నా ఆటను మరో స్థాయికి తీసుకెళ్లా. అతనెప్పుడూ నాకు మద్దతుగానే నిలుస్తాడు. బాధ్యతలు ఎలా స్వీకరించాలో నేర్పించాడు. మా చెన్నై జట్టులో నేను మినహా పవర్‌ప్లేలో మూడు ఓవర్లు వేసే బౌలర్లు ఎవరూ లేరు. అందుకు కారణం మహీ భాయ్. ఆరంభ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం అంత సులువు కాదు. కానీ అతను నన్ను పవర్‌ ప్లే బౌలర్‌గా తీర్చిదిద్దాడు’ అని అన్నాడు. ‘నువ్వు నా పవర్‌ ప్లే బౌలర్‌వి అని మహీ భాయ్ పదేపదే నాకు చెప్తుంటాడు. అతని మాటలు, సలహాలు మెరుగైన బౌలర్‌గా ఎదిగేందుకు నాకు ఉపయోగపడుతున్నాయి. టీ20ల్లో పరుగుల్ని కట్టడి చేయడాన్ని నేర్చుకున్నా. ఓ ఆటగాణ్ని ఎలా వాడుకోవాలో తనకు బాగా తెలుసు. ఇక టెస్టు క్రికెట్‌ ఆడాలనే నా అంతిమ లక్ష్యాన్ని చేరుకునే దిశగా శ్రమిస్తున్నా’ అని దీపక్‌ చహర్‌ తెలిపాడు.

Related posts