telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చైనాలో కొత్త వైరస్ : మనిషికి బర్డ్ ఫ్లూ

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి చైనాలో ఓ మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది. పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్‌ ఫ్లూ మనుషులకు కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చాలా కాలం నుంచి ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇప్పుడు చైనాలో అదే నిజ‌మైంది.  చైనా తూర్పు ప్రావిన్స్ లోని జెన్ జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ ఈ రోజు ప్రకటన చేశారు. వ్యాధుల గుర్తింపు నియంత్రణ విభాగం వారం రోజుల కింద అతడికి రక్త పరీక్షలు చేయగా బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని వివరించింది. అతడిలో హెచ్ 10 ఎన్ 3 స్ట్రెయిన్ వ్యాపించిందని ప్రకటన రావడంతో చైనా వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది.

Related posts