telugu navyamedia
సినిమా వార్తలు

గొప్ప కొడుకుగా, గర్వించే తండ్రిగా మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నా-చిరు

నేడు ఫాదర్స్‌ డే సందర్భంగా ప‌లువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. నాన్న గొప్పదనం గురించి వివరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విటర్‌లో ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి వెంకట్రావ్‌తో కలిసి దిగిన ఫోటోను పంచుకుంటూ గొప్ప కొడుకుగా, గర్వించదగ్గ తండ్రిగా మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నానని ట్వీట్ చేశారు చిరు.

ఫాదర్స్ డే సంద‌ర్భంగా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాదర్స్‌ అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  

Related posts