telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ ప్రారంభించిన ఎక్సైజ్ అధికారులు

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ మొదలైంది. మద్యం కేసులో పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి తంబళ్ల పల్లె కోర్టు అనుమతించింది.

కోర్టు అనుమతి మేరకు ఈరోజు (శుక్రవారం) ఉదయం మదనపల్లి సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం మదనపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి నిందితులను తీసుకువచ్చారు. అనంతరం పది నిందితుల విచారణ ప్రారంభమైంది.

తమ కస్టడీకి తీసుకున్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు ఏ 13 కట్టా సురేంద్ర నాయుడును పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు.

మిగిలిన 9 మందిని వేరువేరుగా ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు.

కట్ట సురేందర్ నాయుడును మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. మిగిలిన వారిని రెండు రోజుల పాటు విచారణకు తంబళ్లపల్లి కోర్టు అనుమతించింది.

కడప అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ జోగేంద్ర, సిట్ బృందం నుంచి మరో అధికారి విచారణ బృందంగా ఏర్పడి విచారణను కొనసాగిస్తున్నారు.

Related posts