telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

ఎస్ బీ ఐ మేనేజింగ్ డైరెక్టర్ గా ఏపీ లోని చీరాల కు చెందిన రామ మోహన్ రావు నియమితులయ్యారు

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్‌గా తెలుగువాడైన అమర రామ మోహన రావు నియమితులయ్యారు.

వచ్చే మూడేళ్ల కాలానికి ఆయనను ఎస్‌బీఐ ఎండీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎస్‌బీఐ బ్యాంక్ చరిత్రలోనే తొలిసారి ఒకేసారి ఇద్దరు తెలుగు వ్యక్తులు బ్యాంక్ టాప్ పోస్టుల్లో ఉండడం గమనార్హం.

ఎస్‌బీఐ ఛైర్మన్‌గా ఇటీవలే తెలుగు వ్యక్తి సి. శ్రీనివాసులు శెట్టి నియమితులైన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఎండీగా ఆంధ్రప్రదేశ్‌ లోని చీరాలకు చెందిన రామ మోహన్ రావు నియామకమయ్యారు.

నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు రామమోహన్ రావు నాలుగో ఎండీగా నియమితులయ్యారు.

Related posts