ఏపీ సీఎం జగన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులోని తన నివాసంలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన భూదందా కోసమే రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్టణానికి మార్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్టణంలో ఆరువేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కన్నా ఆరోపించారు.
రాజధాని విషయంలో తాము తొలి నుంచి ఒకటే వైఖరితో ఉన్నామని స్పష్టం చేశారు. జగన్ తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ పెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని కన్నా స్పష్టం చేశారు.
మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ: కుటుంబ రావు