“క్షణం” సినిమాతో ఊహించని సక్సెస్ ను అందుకున్నాడు హీరో అడివిశేష్. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పుడు మరోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేషన్‌లో “ఎవరు” అనే థ్రిల్లర్ రూపొందించారు. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో అడివిశేష్ హీరోగా, రెజీనా కసండ్ర హీరోయిన్‌గా, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించగా… శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు రాబట్టుకోవడమే కాకుండా, హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు రోజుల్లో ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.76 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.3.61 కోట్లను వసూళ్లను సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రూ.10కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. సినిమా వచ్చిన పాజిటివ్ టాక్, వసూళ్లను చూస్తుంటే మరో రెండు రోజుల్లో సినిమా సేఫ్ జోన్‌కి వెళుతుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
previous post

