నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం ఏ.వి.ఎం ప్రొడక్షన్స్ “సంఘం” సినిమా 10-07-1954 విడుదలయ్యింది.
నిర్మాత ఏ.వి.మెయ్యప్పన్ చెట్టియార్ ఏ.వి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై దర్శకుడు ఎం.వి.రామన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి కథ: వెంకటాచలం, మాటలు, పాటలు: తోలేటి వెంకటరెడ్డి, సంగీతం: ఆర్.సుదర్శనం, ఫోటోగ్రఫీ: టి.ముత్తుస్వామి, కళ: శాంతారాం, నృత్యం: దండాయుధపాణి పిళ్లై, ఎడిటింగ్: ఎం.వి.రామన్ అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, వైజయంతిమాల, అంజలీదేవి, నాగయ్య, ఎస్.వి.రంగారావు, రమణారెడ్డి, ఎస్.బాలచందర్, ఋషేంద్రమణి, హేమలత, తదితరులు నటించారు.
సంగీత దర్శకుడు ఎం.వి.రామన్ అందించిన బాణీ లు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
“భారత వీరకుమారిని నేనే”
“ఆడదంటే అలుసుదేరా అవనిలో దేవతే”
“సుందరంగా మరువలేనోయ్ రావేలా”
వంటి పాటలు ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారికి హీరోయిన్ గా తమిళ నటీమణి వైజయంతిమాల తొలిసారిగా నటించారు.
ఏ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని సమాంతరంగా మూడు భాషలలో నిర్మించారు.
తెలుగు లో “సంఘం” పేరుతోను, తమిళంలో “గర్ల్ “పేరుతోను, హిందీలో “లడకీ ” పేరుతోను చిత్రాలను నిర్మించారు. ఈ మూడు చిత్రాలలో వైజయంతిమాల హీరోయిన్ కాగా తెలుగు లో ఎన్టీఆర్ గారు, తమిళం లో జెమిని గణేషన్, హిందీ లో భరత్ భూషన్ లు హీరోలు గా నటించారు.
ఏ.వి.ఎం ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ గారు నటించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా లో ఎన్టీఆర్ గారికి రఘునాథ ఫాణిగ్రాహి ఒక పాట పాడారు. ఈ సినిమా లో ఎన్టీఆర్ కు ఉన్న ఒక్క పాట ఇదే.
తెలుగులో రఘునాథ ఫాణిగ్రాహి పాడిన మొదటి పాట కూడా ఇదే కావటం విశేషం. ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని పలు కేంద్రాలలో 50 రోజులు, ఒక కేంద్రంలో 100 రోజులు ఆడింది.
విజయవాడ — దుర్గాకళామందిరం లో (83 రోజులు) + షిఫ్ట్ పై 100 రోజులు ఆడింది.