కాళేశ్వరం ప్రాజెక్టు పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
విచారణలో భాగంగా కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ హాజరు కానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు.
కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కార్పొరేషన్ అప్పులు, చెల్లింపులపై కమిషన్ ఈటెలను ప్రశ్నించనుంది.
గత ప్రభుత్వంలో కాళేశ్వరంకు ఖజానా నుంచి చేసిన చెల్లింపులు, పాటించిన నిబంధనలపై కమిషన్ ఆరా తీయనుంది.
ఈ మేరకు ఇప్పటికే కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ప్రశ్నావళి సిద్ధం చేశారు.
కాళేశ్వరం నిర్మాణం సమయంలో కాంట్రాక్ట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు కమిషన్ గుర్తించింది.
ప్రాజెక్ట్ నిర్మాణం ఆర్థిక పరమైన అంశాలపై ఈటెలను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

