రైతుల్లో ఎంతో ఆవేదన, ఆందోళన కనపడుతోంది. పేదవాళ్ళు కు కొత్తగా భూములు ఇవ్వకపోగా గతంలో ఇచ్చినవి లాక్కుంటున్నారు. మన రాష్ట్రంలో మన నీళ్ళు, నిధులు మనకే అన్న కేసిఆర్ నీటిపారుదల ప్రాజెక్ట్స్ లో పెద్దయెత్తున దోపిడీ చేస్తున్నారు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దిండి పేరు మీద కోట్లు దోచుకుంటున్నారు కానీ అస్సలు నీళ్ళు ఎక్కడి నుండి తేస్తరో చెప్పడం లేదు. వేల కోట్లు దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసింది పెద్ద సున్న అని అన్నారు. ఏడు ఏళ్లుగా పేదలకు దక్కాల్సిన నిధులన్నీ కేసిఆర్ దోచుకుతింటున్నడు. కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తా అంటున్న కేసిఆర్ ను డిండి లో ఎత్తి పారేయాలి . ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద చట్టబద్దంగా పెట్టవలసిన 1,75,000 కోట్లు గత 7 ఏళ్లు ఖర్చు పెట్ట కుండా ఈ వర్గాలను మోసం చేశారు. కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం వల్లే ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు 1,75,000 కోట్లు నష్ట పోయారు.. మన డబ్బులు మనకు ఖర్చు చేసే కాంగ్రెస్ మళ్ళీ అధికారం లోకి రావాలి మాయపు మాటలు తో మోసం చేస్తున్న కేసిఆర్ ను ఇంటికి పంపించాలి. రైతు, మహిళ, దళిత, గిరిజన వ్యతిరేక కేసిఆర్ ప్రభుత్వం ను బంగాళాఖాతం లో కలిపేయలి అని తెలిపారు. చూడాలి మరి దీని పై టీఆరెస్ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.
previous post
next post
అమరావతిపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు