ఉదయం 10 గంటలకు మహానాడు రెండో రోజు వేడుక ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్న అశోక్ గజపతిరాజు .
తీర్మానాన్ని బలపరచనున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప. తెలుగుజాతీ-విశ్వఖ్యాతి, విధ్వంసం నుంచి పున్నర్మాణంవైపు అడుగులపై చర్చలు జరగనున్నాయి..
అభివృద్ధి వికేంద్రీకరణ-వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ అంశంపై చర్చలు జరగనున్నాయి.
యోగాంధ్రప్రదేశ్, మౌలిక సదుపాయలతో మారునున్న రాష్ట్ర ముఖచిత్రంపై చర్చలు రాజకీయ తీర్మానంతో పాటు తదితర అంశాలపై మహానాడులో చర్చలు జరగనున్నాయి.
సాయంత్రం మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణస్వీకారం జరగను.

