ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా టూర్ కు వెళ్ళింది. అయితే టీంఇండియా ఆసీస్ పర్యటనలో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు సిరీస్ లలో వన్డే సిరీస్ ను ఆసీస్ టీ 20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్నాయి. ఈ పర్యటనలో అందరి దృష్టి మొదటినుండి టెస్ట్ సిరీస్ పైనే ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య డిసెంబర్ 17న తొలి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ పై స్పందించిన భారత మాజీ క్రికెటర్ ప్రస్తుత ఎన్‌సిఎ చీఫ్ రాహుల్ ద్రవిడ్.. భారత్ కు 500 పరుగులు సాధించే ఆటగాడు కావాలి అన్నాడు. అయితే గత ఏడాది ఆసీస్ గడ్డ పై భారత్ తొలిసారి టెస్ట్ సిరీస్ లో విజయం సాధించింది. అయితే అందులో పుజారా 521 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు భారత జట్టులో ఆ పుజారా పాత్రను పోషించేది ఎవరు..? అది పూజారే అయిన కావచ్చు మరెవరైనా కావచ్చు. కానీ ఈ టెస్ట్ సిరీస్ 500 పరుగులు సాధించే ఆటగాడు టీం ఇండియాకు కావాలి అని అన్నాడు. మన బౌలర్లు 20 వికెట్లు తీయగలరు. ఆసీస్ పిచ్ ల పై వారి బౌలర్లను ఎదుర్కొని ధీటుగా ఆడగలిగే ఆటగాడు ప్రస్తుతం భారత జట్టుకు కావాల్సి ఉంది అని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ ద్రవిడ్ అన్నాడు.
							previous post
						
						
					
							next post
						
						
					

