హైదరాబాద్ నగరంలో 127 మందికి పౌరసత్వం నిరూపించుకోవాలంటూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం భారత పౌరులమని నిరూపించుకోకపోతే ఆధార్ కార్డులను రద్దు చేస్తామని తెలిపింది.
నగరంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తోన్న సత్తర్ ఖాన్ అనే వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలతో ఆధార్ కార్డు అందుకున్నారన్న ఫిర్యాదు మేరకు ఉడాయ్ ఈ నెల 3న అతనికి నోటీసులు జారీ చేసింది. పౌరసత్వం లేకపోతే, భారత్‌లోకి చట్టబద్ధంగానే ప్రవేశించామన్న విషయాన్ని నిరూపించుకోవాలని చెప్పింది. తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు పొందారంటూ తమకు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలోనే నోటీసులు పంపామని అధికారులు చెప్పారు.