తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలసిన డీఎంకే ఎంపీలు ముందుగా మంత్రి కేటీఆర్‌ను పచ్చ కండువాతో సత్కరించారు. నీట్ రద్దు కోరుతూ పలువురు సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కు డీఎంకే ఎంపీలు ఎల్‌ఎం గోవింద్, వీరస్వామి లేఖ అందజేశారు. కేంద్ర విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు డీఎంకే ఎంపీలు తెలిపారు. సీఎం స్టాలిన్ రాసిన లేఖ పట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు డీఎంకే ఎంపీలు వెల్లడించారు.
కేంద్ర ప్రవేశపెట్టిన ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నారు. విద్యావ్యవస్థలో రాష్ట్రాలకే ప్రాధాన్యం ఉండేలా చూడడంలో సహకారం అందించాలని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు స్టాలిన్.
అంతేకాకుండా.. ఆయా రాష్ట్రాల్లోని అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు పార్టీ ఎంపీలని పంపించారు.”కేంద్రం నీట్‌ను ప్రవేశపెట్టి.. సమాఖ్యవాదాన్ని దెబ్బతీసింది. ఈ విషయాన్ని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాము. వైద్యవిద్యా వ్యవస్థ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రం తీసుకుని ఆయా రాష్ట్ర ప్రజల హక్కులను హరిస్తోందని , ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలనేది స్టాలిన్ అభిప్రాయం.
ఈటల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు..