తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల్లో విద్యార్థుల వేసవి సెలవులు ముగియనుండటమే భక్తుల రద్దీ విపరీతంగా పెరగడానికి కారణమని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం సమయం పడుతోందని, భక్తులు ఓపికతో సహకరించాలని అధికారులు కోరారు.
నేడు ప్రధానితో పాటు గవర్నర్, ఏపీ సీఎం తిరుమలకు రానుండటంతో, సాయంత్రం 6 గంటల తరువాత దాదాపు గంటపాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు. శనివారం నాడు 98,044 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 60,478 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.20 కోట్లని అధికారులు తెలిపారు.


జగన్ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి: కేశినేని నాని