telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కమ్యూనికేషన్ స్కిల్స్ పై..రిలయన్స్ ఉచిత శిక్షణ

హైదరాబాద్ నగరంలో రిలయన్స్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. లైఫ్ ఫౌండేషన్, రిలయన్స్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో పది రోజుల పాటు ఉచిత శిక్షణను ఇవ్వడంతో పాటు రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌లో ఉపాధి అవకాశాలు కల్పించబడుతాయని.. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పప్పుల సుధాకర్ తెలిపారు. ఈ నెల 10 నుంచి పది రోజుల పాటు మార్కెటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లపై శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు.

శిక్షణ అనంతరం రిలయన్స్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించ బడుతాయని ఆయన పేర్కొన్నారు. 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉండటంతో పాటు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. డిగ్రీ వరకు చదువుకున్న యువతీ, యువకులు సైతం ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరు కావచ్చునన్నారు. వివరాలకు న్యూనాగోల్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదురుగా ఉన్న బస్టాఫ్ సమీపంలోని రెండో అంతస్తులో ఉన్న లైఫ్ ఫౌండేషన్ కార్యాలయంతో పాటు సెల్‌నెం. 6301867591లో సంప్రదించవచ్చునని తెలిపారు. 

Related posts