తాము శాంతినే కోరుకుంటున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కానీ ఎవరైతే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడతారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిసోమవారం విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరి ప్రయోజనాలు పరిరక్షించేందుకు పుట్టిన పార్టీ వైసీపీ అని అన్నారు. ఆ దిశాగానే పార్టీ అధ్యక్షుడు జగన్ రూపొందించిన విధివిధానాలు కొనసాగుతాయని విజయసాయి అన్నారు.
నిజాయితీ కోసం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేస్తున్నారని విజయసాయి కొనియాడారు. ఇప్పుడు కోర్టు ఇచ్చిన నోటీసుల్లో ఉన్నవారందరు వైసీపీ కార్యకర్తలేనని చెప్పలేమన్నారు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు తన పేరుమీద ఫేక్ ఐడీ క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. గత ఐదున్నరేళ్లుగా సోషల్ మీడియా వ్యవహారాలు తానే చూస్తున్నానని చెప్పారు. టీడీపీ శ్రేణులు కవ్విస్తే తమవాళ్లు పోస్టులు పెట్టారని విజయసాయి సమర్ధించారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై దత్తాత్రేయ ఫైర్