telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆగ్రహం – సుపరిపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం

ఉపసభాపతి రఘురామకృష్ణరాజు నేతృత్వంలో పిటిషన్ల కమిటీ సమావేశం- సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది – కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దది – కలెక్టర్, ఎస్పీ, ఎంపీని ఒక టేబుల్‍పై కూర్చోబెట్టారు – మరో టేబుల్ వద్ద కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిపి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారు – ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదు – ప్రభుత్వ కార్యక్రమానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్‍ను కూడా ఆహ్వానించాలి – ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తా – ఇది మొదటి తప్పుగా భావిస్తున్నా – కార్యక్రమానికి నేను వెళ్లి ఉంటే సీటింగ్ విధానం చూసి బయటికి వచ్చేసేవాణ్ని – అవమానం జరిగిందని చాలామంది ఎమ్మెల్యేలు నాతో చెప్పినందునే మాట్లాడుతున్నా : డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు

Related posts