ఓ ప్రేమ జంట ఢిల్లీ రోడ్లపై రొమాన్స్ పరాకాష్టకు చేరుకుంది. బైక్‌పై వెళ్తూనే ఆ జంట ముద్దుల్లో మునిగిపోయింది. చుట్టూ జనాలు ఉన్నారని, తాము బైక్ రైడింగ్‌లో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి ముద్దులాటలో మునిగిపోయింది. ఓ ఐపీఎస్ అధికారి వారి రొమాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. మోటారు వెహికల్ చట్టంలో కొన్ని మార్పులు తేవాల్సి ఉందంటూ ఆయన చేసిన ట్వీట్‌పై కామెంట్లు హోరెత్తుతున్నాయి.
ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ సమీపంలో జరిగింది. యువతి బైక్ పెట్రోల్ ట్యాంకుపై కూర్చుంటే యువకుడు డ్రైవ్ చేస్తూనే సరస సల్లాపాల్లో మునిగిపోయాడు. లిప్‌లాక్‌లతో ఇద్దరూ రెచ్చిపోయారు. యువకుడు బైక్‌ను నియంత్రిస్తూనే రొమాన్స్‌లో మునిగితేలాడు. సాయంత్రం వేళ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి జంకుగొంకు లేకుండా వారిద్దరూ రొమాన్స్‌లో మునిగిపోవడాన్ని చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు.