telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క‌మ‌ల్ హాస‌న్ పుట్టిన రోజు… “భారతీయుడు-2″కు బ్రేక్

Indian

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఇండియ‌న్ 2. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఏక కాలంలో రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ న‌టించ‌నున్నారు .దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం. శింబు కూడా ముఖ్య పాత్ర చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గ్వాలియ‌ర్‌ల‌లో కొద్దిరోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి తాత్కాలిక బ్రేక్ వేసిన‌ట్టు తెలుస్తుంది. రేపు క‌మ‌ల్ హాస‌న్ పుట్టిన రోజుతో పాటు ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించి 60 సంవ‌త్స‌రాలు పూర్తి చేసిన‌ సంద‌ర్భంగా చెన్నైలో ఘ‌నంగా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు క‌మ‌ల్ చెన్నై వ‌స్తున్నందున‌ చిత్ర షూటింగ్‌ని నిలిపివేశారు. ఈ నెల 13 నుండి కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts