telugu navyamedia
సినిమా వార్తలు

“మహానటి”కి అరుదైన ఘనత… షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం

Mahanati

మహానటి సావిత్రి జీవితక‌థ‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం “మ‌హాన‌టి”. సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ న‌టించారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా పలు ద‌క్షిణాది స్టార్స్ ఈ చిత్రంలో న‌టించారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రానికి తాజాగా మరో అరుదైన గౌర‌వం ద‌క్కింది. “ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌నోర‌మ‌” విభాగంలో ఏకైక భార‌తీయ చిత్రంగా 22వ షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (SIFF)కు “మ‌హాన‌టి” ఎంపికైంది. ఈ వేడుక‌ల్లో భాగంగా మెయిన్ లాండ్ చైనాలో ఈ సినిమా ప్రీమియ‌ర్‌ను ప్ర‌దర్శించ‌నున్నారు. 2018లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా “మ‌హాన‌టి” నిలిచిన సంగ‌తి తెలిసిందే. 2018 మే 9న విడుద‌లైన ఈ చిత్రం 50 రోజుల‌కు పైగా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. ఈ బయోపిక్ కు ప్రేక్షకుల నుంచి అపూర్వమైన స్పందన లభించింది.

Related posts