telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్‌ వద్ద రైతుల నిరాహార దీక్షకు…

ఢిల్లీలోని అన్నదాత ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. మరోవైపు రైతుల్ని బుజ్జగించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించి, ఆందోళనలను ఆపాలని చూస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్న రైతులు..  ఇవాళ ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్‌ వద్ద నిరాహార దీక్షకు దిగనున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 16 వరకు కేంద్రానికి గడువిచ్చిన రైతులు.. ప్రభుత్వం దిగిరాకపోతే ఆమరణ దీక్ష చేపడతామంటున్నారు. మరోవైపు,  రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్‌ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించారు. ఢిల్లీ-జైపూర్‌ ప్రధాన రహదారిని దిగ్బంధించారు. రైతులు చేస్తున్న ఆందోళ‌న‌కు మ‌ద్దుతుగా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు ఉప‌వాసాలు ఉండ‌నున్నారు. ఢిల్లీ సీఎం కేజీవ్రాల్ నిరాహార దీక్ష చేయనున్నారు. దేశంలో ప్రతీ కుటుంబం ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని కేజీవ్రాల్ కోరారు. అలాగే ఢిల్లీ సరిహద్దులు దిగ్బంధం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రైతులకు మద్దతుగా నిలుస్తూ.. పంజాబ్‌ జైళ్ల శాఖ డీఐజీ లక్మీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు వెళ్లే రహదారుల్ని దిగ్భందిస్తామని రైతులు ప్రకటించడంతో పోలీసులు భద్రతా కట్టుదిట్టం చేశారు.

Related posts