telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండోనేషియా : .. మొత్తానికి ఏలియన్ … కనిపించింది…

alian found in indonesia at ceeling

ఎప్పటి నుండో ఏలియన్ గురించి వింటున్నాం.. దానిపై హాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు కూడా తెరపై వసూళ్లు కురిపించాయి. ఇంతకీ అవి మానవాళికి స్నేహితులా లేక శత్రువులా.. నిజంగా అవి మానవులకంటే అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నాయా.. ఇవే కదా ఆ చిత్రాలు చూసినప్పుడు మనకు మదిలో వచ్చిన ప్రశ్నలు. ఏదో సినిమా కాబట్టి మంచి ముగింపు ఇవ్వాలి కాబట్టి.. కొన్నిటిలో ఏలియన్స్ మానవాళికి స్నేహితులన్నట్టు చూపించారు. ఇప్పటికి అసలు అటువంటివి ఉన్నాయా అంటూ పరిశోధకులు తలలు పగలగొట్టుకొని పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా, ఇండోనేషియాలో ఓ ఇంట్లో కనిపించిన ఏలియన్ తరహా వింతజీవి కనిపించింది. బాలీలోని హారీ టోయే అనే వ్యక్తి నివాసంలోని సీలింగ్ కు అతుక్కుని ఉన్న స్థితిలో ఈ ప్రాణి కనిపించింది. దానికి రెండు రెక్కలు, ఏనుగు తొండాల్లాంటి నాలుగు ప్రత్యేక టెంటకిల్స్ ఉన్నాయి. సగం కీటకంలా, సగం జంతువులా కనిపిస్తున్న ఈ జీవిని ఏమని పిలుస్తారో కూడా తనకు తెలియదని, ఇలాంటి విచిత్రజీవిని చూడడం ఇదే ప్రథమమని హారీ టోయే తెలిపాడు. అయితే, జంతుశాస్త్ర నిపుణులు మాత్రం ఇది ఆర్కిటినే కుటుంబానికి చెందిన కీటకం అని చెబుతున్నారు. క్రీటోనోటస్ గాంగిస్ అనే కీటకానికి దగ్గరి బంధువని, ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియాల్లో మాత్రమే కనిపిస్తాయని అంటున్నారు. మొత్తానికి ఏలియన్ అని మాత్రం ఎదురుగా ఉన్నప్పుడు ఒప్పుకోరు కదా!!

Related posts