telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 20, సోమవారం రాశిఫలాలు

 

మేషరాశి

వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు అమలు చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆహ్వానాలు రాగలవు. బంధువుల నుంచి ధనలాభం క‌లుగుతుంది. దైవ‌కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎవ్వరితోను మితిమీరి మాట్లాడ‌క‌పోవ‌డం మంచిది. వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రోత్సాహం ల‌భిస్తుంది.

వృషభరాశి..

ఇంటా బ‌య‌ట ఖర్చులు అధికంగానే ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. బంధువుల‌తో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ‌వుతాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ఉండ‌దు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం మంచిది.

మిథునరాశి..

చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువులు నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్య‌మైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. దైవ‌ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమకు త‌గ్గ గుర్తింపు ల‌భిస్తుంది.

కర్కాటకరాశి..

సన్నిహితులతో విభేదాలు త‌లెత్తుతాయి. స్త్రీలు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. ఆర్థిక ఇబ్బంభ‌దులు ఎక్కువ‌వుతాయి. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు ఏర్ప‌డ‌తాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అంత‌గా రావు.

సింహరాశి..

చిన్న‌నాటి స్నేహితుల‌ను క‌లుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు.ధ‌న‌, వస్తులాభాలు క‌లిసివ‌స్తాయి . వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగంలో పెద్దల స‌హాకారం అందుకుంటారు.

కన్యరాశి..

విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. పరిచయాలు ఎక్కువ‌వుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు అధిగమిస్తారు. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు ల‌భిస్తాయి.

తుల‌రాశి..

నిరుద్యోగలుకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమానంతరం పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఏర్ప‌డతాయి.

వృశ్చికరాశి..

విద్యార్థులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. బంధువులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. కష్టానికి త‌గిన‌ ఫలితం కనిపించదు. ముఖ్య‌మైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి.

ధనుస్సురాశి..

కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం శ్రేయస్కరం. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఉండదు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం క‌లుగుతుంది. చర్చలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరరాశి..

ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తు, వస్త్రలాభాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీ తొంద‌ర‌పాటు వల్ల విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కుంభరాశి…

పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. లీజు, ఏజెన్సీ, నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో పునరాలోచన అవసరం. సన్నిహితులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక లావాదేవీలు అంత‌గా క‌లిసిరావు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఏర్ప‌డ‌తాయి.

మీనరాశి..

రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్య, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధఅవ‌స‌రం. మిత్రులతో మాటపట్టింపులు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు రద్దు అవుతాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని వివాదాలు త‌లెత్తుతాయి.

 

Related posts