telugu navyamedia
క్రీడలు వార్తలు

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఏబీడి షాక్…

భారత్‌ వేదికగా అక్టోబర్‌లో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌ ద్వారా ఏబీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో.. మిస్టర్‌ 360 నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అభిమానుల ఆశలను పటాపంచలు చేస్తూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసకునేదే లేదంటూ ఏబీ తేల్చి చెప్పాడు. రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకునేందుకు డివిలియర్స్ నిరాకరించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా దృవీకరించింది. ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన స్వదేశానికి వెళ్లిన ఏబీ డివిలియర్స్.. ఎవరూ ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. రోజుల వ్యవధిలోనే తన మనసు మార్చుకున్న ఏబీ.. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ఆశించాడు. కానీ టీమ్‌ భవిష్యత్‌ని పట్టించుకోకుండా స్వార్థంగా అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని అప్పట్లో విమర్శించి.. అతని పునరాగమనాన్ని వ్యతిరేకించారు. దాంతో ఏబీ కూడా మౌనంగా ఉండిపోయాడు. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేలవ పరాజయాలతో కనీసం సెమీస్‌కి కూడా చేరలేకపోయింది. కానీ ఐపీఎల్ 2021 ప్రదర్శన కారణంగా ఏబీ డివిలియర్స్ టీ20 ప్రపంచకప్‌ ఆడడం ఖాయమే అనుకున్నారు అందరూ. ఐపీఎల్‌ 2021 అర్ధంతరంగా రద్దు కావడంతో స్వదేశానికి వెళ్లిన ఏబీడిని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సంప్రదించినప్పటికీ.. తన నిర్ణయంలో ఏ మార్పు లేదని, ఉండదని తేల్చేశాడు. హెడ్ కోచ్‌ మార్క్ బౌచర్‌ చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Related posts